శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా కొవిడ్-19 పరీక్షల కేంద్రం ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొన్ని రోజులుగా నమూనాల సేకరించి పరీక్షలు స్థానికంగా నిర్వహిస్తున్నారు. పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో పలువురు వైద్య సిబ్బందికి వైద్య పరీక్షల నిమిత్తం శ్రీకాకుళం పంపించారు. ఇదే ప్రాంతంలో జిల్లాలోనే మొదటి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలువురు వైద్య సిబ్బందికి పరీక్షలు నిర్వహించేందుకు తరలించారు. దీంతో ఆసుపత్రిలో విధులు నిర్వహించేందుకు వైద్యులు అరకొరగా ఉన్నారు.
ఇవీ చూడండి...