ETV Bharat / state

పాలకొండలో కరోనా కలవరం.. సచివాలయ ఉద్యోగుల్లో లక్షణాలు

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కరోనా కలకలం రేపుతుంది. తాజా ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, వీఆర్​ఏకు కరోనా లక్షణాలు కనిపించటంతో వారిని శ్రీకాకుళం తరిలించారు. పాలకొండలో కరోనా కేసులు పెరుగుతుండడంపై జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్.. స్థానిక అధికారులతో సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పాలకొండలో కరోనా కలవరం
పాలకొండలో కరోనా కలవరం
author img

By

Published : Jun 11, 2020, 11:45 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కరోనా కలకలం రేపుతుంది. సచివాలయం ఉద్యోగులలో కొవిడ్ లక్షణాలు కనిపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. పాలకొండ పునరావాస కేంద్రంలో వలస కూలీలతో పాటు ఉంటున్న ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, వీఆర్ఏకు కరోనా అనుమానిత లక్షణాలు గుర్తించారు. వారిని శ్రీకాకుళం తరలించారు.

కరోనా నివారణ చర్యలపై జేసీ సుమిత్ కుమార్ ఆరా

ఈ ఘటనపై జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్.. ఆర్డీవో టీవీఎస్ కుమార్​తో సమీక్షించారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అనంతరం పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఆర్డీవో టీఎస్​వి కుమార్ తహసీల్దార్ కార్యాలయంలో.. సిబ్బందితో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి, యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వైద్యులు.. సచివాలయం, నగర పంచాయతీ, తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. పాలకొండ మండలంలో ఇప్పటి వరకూ ఎనిమిది మందిలో కరోనా లక్షణాలు గుర్తించారు. వారిని శ్రీకాకుళం తరిలించారు.

ఇదీ చదవండి : హైకోర్టుకు ముగ్గురు నూతన ప్రభుత్వ న్యాయవాదులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.