రాష్ట్రంలో మన బడి నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా వైకాపా ప్రభుత్వం పాఠశాలలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. అందులో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో తొలివిడతలో ఎంపిక చేసిన.. 28 పాఠశాలల్లో అధికారులు పనులు చేయించారు. విద్యార్థులను ఆకర్షించేలా గోడలపై రంగులు, బొమ్మలను వేయించారు. కానీ గోడలపై పసుపు రంగు వేయడంతో పాలక పక్షానికి చెందిన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో.. కొర్ని గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రంగులు మార్చారు. పసుపు రంగుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ...రంగును మార్చివేశారు. మిగిలిన పాఠశాలల్లోనూ నీలం రంగు వేయిస్తున్నామని ఆర్ వీఎం ఏఈ సురేష్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:
Rains in Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా.. వర్షాలు విస్తారంగా...!