శ్రీకాకుళం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైద్య సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ఐదో విడత ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించాలన్న కలెక్టర్.. జిల్లాలో ఐదు వందలకుపైగా పాజిటివ్ కేసులు వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదన్నారు.
ప్రస్తుతం జిల్లాలో 206 కరోనా కేసులు ఉన్నాయన్నారు. వాటిలో ఎనిమిది మినహా మిగిలినవన్నీ బయట నుంచి వచ్చిన వారివేనని కలెక్టర్ నివాస్ స్పష్టం చేశారు
ఇదీ చదవండి: అహోబిలం రహదారిపై అడ్డంగా కూర్చొన్న చిరుత!