ETV Bharat / state

ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు జారీ

author img

By

Published : Mar 24, 2021, 9:24 PM IST

శ్రీకాకుళం జిల్లాలోని ట్రాన్స్​జెండర్లకు.. గుర్తింపు కార్డులు మంజూరు చేశారు కలెక్టర్ నివాస్​. ట్రాన్స్​జెండర్లు ఏ హక్కులకు దూరం కావలసిన అవసరం లేదని కలెక్టరు చెప్పారు. కేంద్ర సామాజిక న్యాయ అమలు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు.. కార్డులను పంపిణీ చేశామన్నారు.

Collector Nivas issued identity cards to transgenders
ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు జారీ చేసిన కలెక్టర్ నివాస్

రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా శ్రీకాకుళం జిల్లాలో ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో.. కలెక్టర్ నివాస్ ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కేంద్ర సామాజిక న్యాయ అమలు మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు.. ఈ కార్డులను విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్ల శాఖ సిద్ధం చేసిందన్నారు. ట్రాన్స్‌జెండర్లు ఆన్‌లైన్‌లో తమ వివరాలు నమోదు చేసుకునేందుకు బెజ్జిపురం యూత్‌ క్లబ్ సహాయం చేసిందని చెప్పారు.

సమాజంలో అందరితో పాటు ట్రాన్స్ జెండర్లు సమాన హక్కులు కలిగి ఉంటారని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల వివరాలకు గ్రామ సచివాలయంలో సంప్రదించాలని సూచించారు. గుర్తింపు కార్డుల జారీతో.. సామాజిక వివక్షకు దూరంగా ఉండటమే కాకుండా సంక్షేమ పథకాలను పొందేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.

ఇవీ చూడండి:

రైల్వే ఇన్​స్టిట్యూట్​ను ప్రారంభించిన ఈస్ట్​ కోస్ట్ రైల్వే జీఎం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.