CM JAGAN FIRES ON CBN AND PAWAN : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సభలో సీఎం జగన్.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. తెలుగుదేశం, జనసేనలపై మండిపడ్డ ఆయన.. తమ ప్రభుత్వంపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో చేస్తున్న మంచిని చెప్పడం లేదన్నారు. ఇద్దరూ కలిసి అధికారం కోసం ఆరాటపడుతున్నారన్న జగన్.. వారు చెప్పే మాటలు నమ్మవద్దని సూచించారు. ప్రతి ఇంటికీ తాను అందిస్తున్న సంక్షేమ ఫలాలను గమనించాలని ప్రజలను కోరారు. మంచి జరిగితే అండగా నిలబడాలని కోరారు. తాను నమ్ముకున్నది ప్రజలు, దేవుడి దయనే అన్న జగన్.. ప్రతి ఇంటికీ మంచి జరిగిందా? లేదా? అనే అంశాన్ని కొలమానంగా పెట్టుకోవాలని సూచించారు.
ఇవీ చదవండి: