ETV Bharat / state

'లాక్​డౌన్​ పొడిగించకూడదనేది సీఎం జగన్ ఉద్దేశం' - కరోనా లాక్​డౌన్

లాక్​డౌన్​తో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. లాక్​డౌన్​ను పొడిగించకూడదని సీఎం జగన్ అనుకుంటున్నారని ఆయన తెలిపారు. కానీ కేంద్రం మాత్రం పొడిగించే యోచనలో ఉందని తెలిపారు.

VIJAYA SAI REDDY
VIJAYA SAI REDDY
author img

By

Published : Apr 9, 2020, 8:02 PM IST

విజయసాయిరెడ్డి ప్రసంగం

లాక్​డౌన్​ను కొనసాగించకూడదనేది ముఖ్యమంత్రి జగన్​ ఉద్దేశమని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. లాక్​డౌన్​తో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని... అందువల్ల రాష్ట్రంలోని హాట్​స్పాట్లలోనే లాక్​డౌన్ కొనసాగించాలనేది సీఎం జగన్ ఆలోచన అని ఆయన అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్ కొనసాగించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆర్ ​అండ్ బీ మంత్రి ధర్మాన కృష్ణదాస్​తో కలిసి శ్రీకాకుళంతో పాటు జిల్లాలోని కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలం వడ్ఢితాండ్ర, టెక్కలి మండలం గడిమెట్ట జగన్నాథపురం గ్రామాల్లో పేదలకు విశాఖపట్నానికి చెందిన ప్రగతి భారత్ ఫౌండేషన్ తరఫున నిత్యావసర సరకులను ఆయన పంపిణీ చేశారు. కేంద్రం లాక్​డౌన్​ను పొడిగించినా ప్రజలకు నిత్యావసర సరకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో కరోనా బాధితుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.