శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్ పేట మండలం గొట్టిపల్లి పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తెదేపాకు చెందిన దివ్యాంగుడు ఓటు వేసేందుకు సహాయకునితో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నాడు. దివ్యాంగుడి ఓటు.. సహాయకుడు వేసేందుకు ప్రయత్నించగా వైకాపాకు చెందిన వారు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అధిక సంఖ్యలో రెండు పార్టీల వారు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఆమదాలవలస సీఐ ప్రసాదరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నించారు. ఎంతకీ వారి మాట వినకపోవటంతో లాఠీచార్జీ చేసి.. గందరగోళం చేస్తున్నవారిని చెదరగొట్టారు. అనంతరం పోలింగ్ యధావిధిగా సాగింది.
ఇదీ చదవండి: జూలూరు పంచాయతీలో స్వల్ప ఉద్రిక్తత