శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్వచ్ఛత కమిటీ సందర్శించింది. ఈ సందర్భంగా వర్శిటీలో పచ్చదనం, పరిశుభ్రత, తాగునీటి సరఫరా, సోలార్ వినియోగాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు. వర్సిటీ ఉపకులపతి డాక్టర్ కె.రామ్ జీ వర్సిటీలో అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కమిటీలో రాజస్థాన్ మహాత్మ జ్యోతిరావు పూలే విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆర్పీ సింగ్, బెంగళూరు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్య ఎం.నారాయణప్ప తదితరులు సభ్యులుగా ఉన్నారు.
ఇదీ చూడండి : పోలీసుల ఆకస్మిక తనిఖీలు-15 వాహనాలు స్వాధీనం