శ్రీకాకుళం జిల్లాలో కర్మాగారాలశాఖ తనిఖీ కార్యాలయంలో ఓ అధికారిణిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అందుకు కారణం ఆమె సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకోవడమే. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి.కుసుమ కుమారి 18 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. మొదటి నుంచి బాధ్యతారాహిత్యంగా పని చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఆమె పని తీరుపై విమర్శలు రావడంతో ఇటీవల అధికారులు సీసీ కెమెరాలు పెట్టించినట్లు తెలిసింది. ఇటీవల ఆమె భయపడకుండా సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకుంది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఆమెను సస్పెండ్ చేసినట్లు కర్మాగారాల శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ శర్మ మీడియాకు తెలిపారు.
ఇదీ చదవండి: విద్యార్థులను కూలీలుగా మార్చిన ప్రధానోపాధ్యాయుడు