విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు సంఘీభావంగా.. శ్రీకాకుళంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో బంద్‌కు ప్రజలంతా సహకరించాలని కోరుతూ ద్విచక్రవాహనాలతో ప్రదర్శన చేశారు. ఏడురోడ్ల కూడలి నుంచి డే అండ్ నైట్ జంక్షన్, రామలక్ష్మణ కూడలి మీదుగా పాత బస్టాండు నుంచి డైమండ్ పార్కు వరకు ర్యాలీ జరిగింది. ఈ ప్రదర్శనలో అన్ని ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కేసుల మాఫీ కోసం ఉక్కు కర్మాగారాన్ని త్యాగం చేస్తున్నారు: అచ్చెన్న