శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధి రత్తకన్న సమీపంలో ద్విచక్రవాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో.. వాహనం కాలి బూడిదైంది. బిర్లంగి గ్రామానికి చెందిన బోర పురుషోత్తం అనే వ్యక్తి వద్ద అతని స్నేహితుడు బైక్ తీసుకుని ఇచ్ఛాపురం బజార్ కి వెళ్లాడు.
పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి తిరుగు పయనమయ్యాడు. బైక్ నుంచి పొగలు రావటాన్ని గుర్తించిన స్థానికులు.. అతన్ని అప్రమత్తం చేశారు. వెంటనే ద్విచక్ర వాహనాన్ని వదిలేశాడు. కొద్దిసేపట్లోనే వాహనం మంటల్లో పూర్తిగా కాలిపోయింది.
ఇదీ చదవండి:
ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం... ఇద్దరు మృతి