ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ... యువకుడికి తీవ్రగాయాలు - శ్రీకాకుళం జిల్లా లావేరులో బైక్ను ఢీ కొన్న లారీ

ద్విచక్రవాహంపై విధులకు వెళ్తున్న ఓ యువకుడిని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. స్థానికులు చికిత్స నిమిత్తం ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో జరిగింది.

లావేరులో మండలంలో బైక్​ ఢీకొన్న లారీ... యువకుడికి తీవ్రగాయాలు

author img

By

Published : Aug 14, 2020, 12:28 PM IST

Updated : Aug 14, 2020, 2:15 PM IST

శ్రీకాకుళం జిల్లా లావేరులో మండలం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. బొంతుపేట కూడలి వద్ద గురువారం ఉదయం ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మురపాక గ్రామానికి చెందిన అడపా బాలకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ఇదీ జరిగింది....

యువకుడు రణస్థలం మండలం పైడి బీమావరం వద్ద ఉన్న ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై వెళుతుండగా లారీ వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో యువకునికి కాళ్ళు, చేతులు విరిగిపోయాయి. లారీ కింద ఉన్న యువకుడిని స్థానికులు బయటకు తీసి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. ఎంతసేపైనా వాహనం రాకపోవడంతో ఆటోలో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై లావేరు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి

4,800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

Last Updated : Aug 14, 2020, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.