కరోనా కట్టడిలో భాగంగా.. శ్రీకాకుళం జిల్లాలో నమూనాలు సేకరించడమే కాకుండా పరీక్షలు నిర్వహించే వెసులుబాటు లభించింది. ప్రత్యేక మొబైల్ కోవిడ్ విస్కులను జిల్లా యంత్రాంగం రంగంలోకి దించింది. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో కలెక్టర్ నివాస్ పరీక్షలను ప్రారంభించారు.
19 విస్క్ లను పాలకొండ, పాతపట్నం, సీతంపేట, కొత్తూరు, బారువ, సోంపేట, కవిటి, ఇచ్చాపురం, హరిపురం, కోటబొమ్మాళి, నరసన్నపేట, పలాస, టెక్కలి, బుడితి, ఆమదాలవలస, రాజాం, పొందూరు, రణస్థలం ఆసుపత్రులతోపాటు శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు.
వీటితోపాటు మరొ రెండు మొబైల్ విస్కులను ఏర్పాటు చేసారు. ఏదైనా ప్రాంతంలో కోవిడ్ లక్షణాలు అధికంగా కనిపిస్తే ఆ ప్రాంతానికి మొబైల్ విస్క్ లు వెళ్తాయని అధికారులు చెప్పారు. రెండు మొబైల్ విస్క్ లు ద్వారా ఈరోజు 35 నమూనాలు సేకరించారు. ఈ పరీక్షల ఫలితాలు రేపు వెలువడనున్నాయి.
ఇదీ చదవండి: