ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్​పై అవగాహన ర్యాలీలు

కొవిడ్ రెండో వేవ్ మెుదలైన తరుణంలో....శ్రీకాకుళం జిల్లా అధికారులు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తగిన జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలు కొవిడ్ బారినపడుతున్నారు.

awareness-rally-on-corona-in-srikakulam-district
శ్రీకాకుళంలో కరోనాపై అవగాహన ర్యాలీ
author img

By

Published : Nov 4, 2020, 1:04 PM IST

శ్రీకాకుళం జిల్లాలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విజృంభించిన కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో రోజూ 1000కి పైగా కొత్త కేసులు నమోదయ్యేవి. గడచిన పది రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య 100 లోపే ఉంటోంది. కొత్తగా నమోదవుతున్న కేసులో అధిక శాతం మంది రోగులు హోమ్ ఐసోలేషన్లో ఉండడానికి ఆసక్తి చూపుతున్నారు. మంగళవారం నాటికి జిల్లాలో 781 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 168 మంది కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 560 మంది రోగులు కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స తీసుకుంటున్నారు. మిగిలిన వారంతా హోం ఐసోలేషన్లో ఉన్నారు.

కొవిడ్ విషయంలో గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అధిక శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటున్నాయి. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో గ్రామీణ ప్రాంతాలు సహా పట్టణాల్లోని అన్ని దుకాణాలు కిక్కిరిసి పోతున్నాయి. కొవిడ్ ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇతర దేశాలు, రాష్ట్రాల్లో కొవిడ్ రెండోసారి విజృంభిస్తున్న తరుణంలో అన్నిచోట్ల అవే పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న పరిస్థితులను ముందస్తుగానే అంచనా వేసిన అధికారులు జిల్లా వ్యాప్తంగా కొవిడ్ అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవడం మరవద్దు...వైరస్ వ్యాప్తికి కారణం కావద్దు...వంటి నినాదాలతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు.

ఇదీ చదవండి:

ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.