ETV Bharat / state

తెదేపా ఎంపీటీసీ అభ్యర్థిపై కత్తులు, కర్రలతో దాడి - ఎన్నికల వార్తలు

శ్రీకాకుళం జిల్లాలో తెదేపా తరఫున ఎంపీటీసీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థిపై దుండగులు దాడి చేశారు. బాధితులు ప్రస్తుతం పాలకొండ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.

attack on a mptc candidate in Srikakulam district
తెదేపా ఎంపీటీసీ అభ్యర్థిపై కత్తులు, కర్రలతో దాడి
author img

By

Published : Mar 14, 2021, 10:42 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని పల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి రామారావుపై ఆదివారం రాత్రి పలువురు దాడికి పాల్పడ్డారు. తాను ఇంట్లో ఉన్న సమయంలో దుండగులు కత్తులు, కర్రలతో దాడికి పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు.

ఈ దాడిలో రామారావుతో పాటు అతని భార్య రాధ గాయపడ్డారు. ఎంపీటీసీ ఎన్నికల్లో తెదేపా తరఫున అభ్యర్థిగా ఉన్న తనను పోటీ నుంచి తప్పించేందుకు చేసిన ప్రయత్నమని రామారావు ఆరోపించారు. దాడిలో గాయపడిన వీరిని పాలకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి:

పాలకొండ నగర పంచాయతీలో వైకాపా విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.