నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ ముందడుగు వేస్తున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా బాపూజీ కళామందిర్ వేదికగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉపాధి జ్యోతి వెబ్‌సైట్ ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువతను వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యాపార, ఉద్యోగ కల్పన కార్యాలయాలు, సంస్థలతో అనుసంధానించడం ఈ వెబ్‌సైట్ ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. జిల్లా యువతకు ఇది చక్కని అనుసంధాన వేదికగా ఉండటంతోపాటు ఉపాధి మార్గానికి బాటలు వేస్తుందన్నారు.
ఇదీచదవండి