ETV Bharat / state

12 ఏళ్ల తరువాత ఆదిత్యునికి స్వర్ణాభరణాల అలంకరణ - అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం వార్తలు

వెలుగుల రేడుకు స్వర్ణాభరణాల అలంకరణకు సమయం ఆసన్నమైంది. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలోని ఆదిత్యుడ్ని బంగారు కాంతుల్లో వీక్షించాలనుకునే వారికి కనులారా చూసే భాగ్యం కలగనుంది. ఈనెల 25న ఏకాదశి, 26న చిలుకు ద్వాదశి సందర్భంగా మూలవిరాట్టుకు వీటిని అలంకరిస్తారు.

arasavalli-suryanarayana-swamy
arasavalli-suryanarayana-swamy
author img

By

Published : Nov 24, 2020, 10:54 PM IST

Updated : Nov 25, 2020, 12:31 AM IST

స్వర్ణాభరణాలతో సూర్యభగవానుడు దర్శనం

శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారు నేడు, రేపు బంగారు ఆభరణాలతో భక్తులకు దర్శనమిస్తారు. 2008 రథసప్తమి తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆదిత్యుడ్ని వెండి నగలతోనే అలంకరిస్తున్నారు. కార్తిక ఏకాదశి, ద్వాదశి సందర్భంగా 12 ఏళ్లు తర్వాత మళ్లీ ఇప్పుడు వెలుగులరేడు ప్రత్యేక అలంకరణతో రెండు రోజులపాటు భక్తులకు దర్శనభాగ్యం ఇవ్వనున్నారు.

కిరీటం నుంచి పాదాల వరకు బంగారు ఆభరణాలు అలంకరిస్తామని సూర్య దేవాలయం ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు. భద్రతా ప్రమాణాలు మెరుగుపరుచుకుని దేవాదాయశాఖ అనుమతులతో ప్రతి ఆదివారం బంగారు ఆభరణాలతో అలంకరిచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

స్వర్ణాభరణాలతో సూర్యభగవానుడు దర్శనం
సూర్యభగవానుడి స్వర్ణాభరణాలు

ఇదీ చదవండి

తుంగభద్ర పుష్కరాలు : ఐదో రోజూ అంతంత మాత్రమే!

Last Updated : Nov 25, 2020, 12:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.