ETV Bharat / state

'జలవనరుల ప్రాజెక్టుల పూర్తే ఈ ఏడాది లక్ష్యం'

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కలెక్టర్ నివాస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది.. జిల్లాలో నిర్మాణంలో ఉన్న జలవనరుల ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు.

aquatic projects completion in srikakulam is goal for this new year  says collector nivas
ఈ ఏడాది జలవనరుల ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యమన్న కలెక్టర్ నివాస్
author img

By

Published : Jan 1, 2020, 10:05 AM IST

ఈ ఏడాది జలవనరుల ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యమన్న కలెక్టర్ నివాస్

జలవనరుల ప్రాజెక్టులను పూర్తి చేయడం, సాగు నీటి వనరుల పూర్తి సామర్ధ్యాన్ని ఉపయోగించుకోవడమే ఈ ఏడాది లక్ష్యమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ చెప్పారు. ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. హిరమండలం వద్ద వంశధార రిజర్వాయర్ పనులను పూర్తి చేసి రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు కల్పించాలని భావిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మహేంద్రతనయపై ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి... సాగు, తాగు నీరు కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. నాగావళి, వంశధార నదుల అనుసంధానం పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని వివరించారు. వచ్చే రబీ నాటికి సాగునీరు అందించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. బొంతు ఎత్తిపోతల పథకం కింద 11 వేల 7వందల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని కలెక్టర్ అంచనా వేశారు. ఎత్తిపోతల పనులు 50 శాతం పూర్తి అయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవశకం కార్యక్రమాన్ని...జిల్లాలో సమర్ధవంతంగా అమలయ్యేలా చూస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

స్పందనలో మంత్రి ధర్మాన... ప్రజా వినతులు స్వీకరణ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.