శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో... ఏపీ సైన్స్ కాంగ్రెస్-2019 ఐదో సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజులు జరగనున్న ఈ సమావేశాలను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించారు. ఇవాళ జిల్లాకు వచ్చిన ఆయనకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, విశ్వవిద్యాలయ ఉపకులపతి, కలెక్టర్, ఉన్నతస్థాయి అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం విశ్వవిద్యాలయంలోని అంబేడ్కర్ విగ్రహానికి గవర్నర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తరువాత సమావేశాలను ప్రారంభించి... చిన్నారుల ఆవిష్కరణలను ఆసక్తిగా తిలకించారు.
ఇదీ చదవండి