వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర ఏళ్ల కాలంలో ఉత్తరాంధ్ర జిల్లాలు పూర్తిగా వెనుకబడిపోయాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు ఆరోపించారు. సాగునీరు, పరిశ్రమలు, విద్య ఉపాధి లేక వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
రాజాం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. తోటపల్లి శివారు ప్రాంతాలకు రెండున్నర ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. ఎక్కడి ప్రాజెక్టు అక్కడే ఆగిపోయాయని అన్నారు. 14 వేల ఎకరాలకు నీరు అందక పోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు .
జగన్ టాక్స్ లకు భయపడి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమల కూడా పోయే పరిస్థితి నెలకొందని అన్నారు. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర జిల్లాల పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని హితవుపలికారు.
ఇదీ చదవండి: 'అన్ని వర్గాల వారికి సమన్యాయం అందించడమే ప్రభుత్వం లక్ష్యం'