ETV Bharat / state

యువకుల గల్లంతు.. మరో మృతదేహం లభ్యం - youth drowned in river news

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో ఆదివారం గల్లంతైన యువకుల మృతదేహాల్లో మరొకరి మృతదేహం నేడు లభ్యమైంది. పోలీసులు, స్థానిక జాలరులు రెండురోజులుగా గాలింపు చర్యలు చేపట్టగా.. ఒడిశాలోని సున్నాపురం సమీప తీరంలో గోపిచంద్ మృతదేహాన్ని గుర్తించారు.

another dead body found
మరో మృతదేహం లభ్యం
author img

By

Published : Jun 29, 2021, 3:35 PM IST

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో ఆదివారం గల్లంతైన యువకుడి మృతదేహం ఒడిశా తీరంలో లభ్యమైంది. పుక్కల్లపాలేం సముద్ర తీరంలో పుట్టినరోజు వేడుకల్లో భాగంగా బుర్ర పుట్టుగా గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఆదివారం గల్లంతు కాగా.. అందులో ముగ్గురు యువకులు మృతదేహాలు అదేరోజు సాయంత్రం లభ్యమయ్యాయి. అయితే మరో మృతదేహానికి స్థానిక మత్స్యకారులు పోలీసులు రెండురోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు మంగళవారం వేకువజామున ఒడిశా సున్నాపురం సమీప తీరంలో గోపీచంద్ (18) మృతదేహం లభ్యమైంది.

పుట్టిన రోజు వేడుకల్లో విషాదం..

బొర్రపుట్టుగ గ్రామానికి చెందిన సాయిలోకేశ్ (20), తిరుమల (17), మనోజ్‌కుమార్ (21), గోపీచంద్ (18) కలిసి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్నారు. ఏడాదంతా గుర్తుండేలా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం సముద్రతీరంలో వాలిపోయారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. సరదాగా సముద్రంలో స్నానానికి దిగి కాసేపు ఎంజాయ్ చేశారు. అంతా ఆనందంలో మునిగితేలుతుండగా..వారిపై గంగమ్మ కన్నెర్ర చేసింది. ఒకరి పుట్టిన రోజు నలుగురికి చివరిరోజుగా మారింది. సముద్రంలో గల్లంతై..నలుగురు ప్రాణాలు విడిచారు.

ఒకే గ్రామానికి చెందిన నలుగురు యువకులు బీచ్​లో గల్లంతై మృతి చెందడంతో విషాదం నెలకొంది.ముగ్గురి మృతదేహాలు అదే రోజు లభ్యం కాగా మరొకరి మృతదేహం మంగళవారం లభ్యమైంది.

ఇదీ చదవండి:

భార్యపై అనుమానంతో హత్య

డ్రోన్ల దాడిపై విచారణ- ఆర్డీఎక్స్ వాడారా​?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.