శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి గ్రామ సచివాలయంలో వాలంటీరు, ఏఎన్ఎం మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కేకలు వేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వాలంటీరు తనపై అజమాయిషీ చలాయిస్తున్నాడంటూ.. ఏఎన్ఎం ఆరోపణలు చేసింది. దాడి చేశాడని ఎంపీడీవోకు ఫిర్యాదు చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో వీరిమధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: MLC candidates : ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైకాపా