రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రపంచానికి మహానీయుడని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన అంబేడ్కర్ 129వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కరోనా విషయంలో ప్రజలు క్రమశిక్షణ పాటించి లాక్డౌన్ విజయవంతం చేయాలని కోరారు.
ఇదీ చూడండి: