శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం చవ్వాకులపేట వద్ద పురుషోత్తపురం నైరా చానల్‌కు గండి పడింది. సాగునీరు పంట పొలాల్లోకి భారీగా చేరుతోంది. ఇటీవల వంశధార వరదల కారణంగా పలు ప్రాంతాల్లో గండి పడినా అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు వృథాగా పోతుందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి