తమపై లేనిపోని అభాండాలు వేసి మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో దివంగత ఎర్రన్నాయుడు జయంతి కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎర్రన్నాయుడు ఘాట్ వద్ద నివాళులు అర్పించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణలపై స్పందిస్తూ వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'ఎక్కడా తప్పు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎర్రన్నాయుడు సాక్షిగా చెబుతున్నా... నీకు దిక్కున్నది చేసుకో. మా పరిపాలన కాలంలోని దస్త్రాలన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయి' అని అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. ఇలాంటి రాక్షస పాలన ఎన్నడూ చూడలేదని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీతోనే ఉంటామని, ప్రజలకు అండదండగా నిలుస్తామని తేల్చిచెప్పారు. మళ్లీ తెదేపాను అధికారంలోకి తీసుకువస్తానని అన్నారు.
సీఎం జగన్కు అచ్చెన్నాయుడు సవాల్ - ఏపీలో ఈఎస్ఐ కుంభకోణం
ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణలపై తెదేపా నేత అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు. తమ పాలనలోని దస్త్రాలన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయని... దిక్కున్నది చేసుకో అంటూ సీఎం జగన్కు సవాల్ విసిరారు.

సంబంధిత కథనం: