ETV Bharat / state

అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా - news esi case

అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై విచారణ గురువారానికి వాయిదా పడింది. దర్యాప్తు అధికారుల సాక్ష్యాల సేకరణ పూర్తయిన నేపథ్యంలో బెయిలు మంజూరు చేయాలని అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాది వాదించారు. అనుమతి తీసుకోకుండా నమోదు చేసిన కేసు చెల్లుబాటు కాదన్నారు. తన వాదనలకు బలం చేకూర్చే సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించాలని కోరారు. సంబంధిత తీర్పు ప్రతులు న్యాయమూర్తి ముందుకు చేరని కారణంగా... విచారణ గురువారానికి వాయిదా పడింది.

Achennai  bail petition  hearing adjourns
అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
author img

By

Published : Jul 14, 2020, 10:48 PM IST

మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అనిశా అధికారులు అరెస్ట్ చేసి ముప్పై రోజులు దాటిందని.. దర్యాప్తు అధికారుల సాక్ష్యాల సేకరణ పూర్తయిన నేపథ్యంలో బెయిలు మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా హైకోర్టులో వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతోనే తన క్లయింటును కేసులో ఇరికించారన్నారు. మూడో నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉందన్న కారణం చూపుతూ పిటిషనర్ కు బెయిల్ ఇవ్వకూడదని అనిశా చెప్పడం సరికాదన్నారు.

అచ్చెన్నాయుడిపై కేసు నమోదు చేసేందుకు, విచారణ జరిపేందుకు అవినీతి నిరోధక చట్టం ప్రకారం అధికారులు అనుమతి తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనుమతి తీసుకోకుండా నమోదు చేసిన కేసు చెల్లుబాటు కాదన్నారు. తన వాదనలకు బలం చేకూర్చే సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించాలని కోరారు. సంబంధిత తీర్పు ప్రతులు న్యాయమూర్తి ముందుకు చేరని కారణంగా.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్.. విచారణను గురువారానికి వాయిదా వేశారు.

టెలీ హెల్త్ సర్వీసు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు పనులు అప్పగించేలా అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీకే రమేశ్ కుమార్ ను ఒత్తిడి చేశారన్న ఆరోపణలతో అనిశా కేసు నమోదు చేసి ఆరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈఎస్ఐ ఔషధాల కొనుగోలు అవకతవకల కేసులో అరెస్ట్ అయిన ఐఎంఎస్ మాజీ డైరక్టర్ సీకే రమేష్ కుమార్ కూడా.. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. వాదనలు వినిపించేందుకు అనిశా తరపు న్యాయవాది సమయం కోరగా.. తదుపరి విచారణను శుక్రవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

కరోనా బాధితురాలు.. ఆసుపత్రిలో పడకలు లేవని బస్సులో ఇంటికెళ్లింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.