Pork Meat: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆంధ్రా వీధికి చెందిన యర్ర ఈశ్వరరావు చిరు వ్యాపారి. రోడ్డు పక్కన పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉదయం పంది మాంసం కోసం దుకాణానికి వెళ్లిన ఈశ్వరరావు.. ఓ ముక్కను నోట్లో వేసుకున్నాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన అతని స్నేహితులు మరో ముక్క తినాలని అకతాయిగా పందెం కాశారు.
ఎలాగైనా పందెం గెలవాలనుకున్న ఈశ్వరరావు ఓ ముక్కను నోట్లో వేసుకున్నాడు. అదికాస్త గొంతుకు అడ్డం పడి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. కిందపడి గిలగిలా కొట్టుకోవటంతో ఆందోళన చెందిన అతని స్నేహితులు.. ఓ రిక్షాపై హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతుడు ఈశ్వరరావుకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోవటంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అకతాయిగా చేసిన ఓ పని.. ఆ కుటుంబానికి తీరని వేదనను మిగిల్చింది. కాగా..ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.
ఇవీ చూడండి
Live Video: షటిల్ ఆడుతూ.. కోర్టులోనే కుప్పకూలిన యువకుడు !
ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్లో వాళ్లే !
'బలవంతంగా తీసుకెళ్లి ఇంజెక్షన్లు ఇచ్చారు'.. శివసేన ఎమ్మెల్యే