భార్య తనకు ఇష్టమైన కూర వండలేదని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో జరిగింది. పట్టణంలో అన్నపూర్ణ ఆశ్రమానికి చెందిన బెల్లాల ఆంజనేయులు తనకు ఇష్టమైన కూర వండమని భార్యకు చెప్పాడు. అయితే లాక్డౌన్ కారణంగా దుకాణాలు తెరవనందున వండలేనని భార్య నిరాకరించింది. ఈ క్రమంలో భార్యతో గొడవపడ్డాడు. అనంతరం క్షణికావేశంలో సమీపంలోని కూరగాయల పొలంలోని నేలబావిలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు డైలీ కలెక్షన్ ఏజెంట్గా పని చేస్తున్నట్టు బంధువులు తెలిపారు.
ఇదీ చూడండి..
రాష్ట్రంలో కొత్తగా 2,593 కరోనా కేసులు.. 24 గంటల్లో 40 మంది మృతి