ETV Bharat / state

శ్రీకాకుళంలో వైఎస్ఆర్ ఉచిత విద్యుత్.. నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతి - శ్రీకాకుళంలో వైఎస్ఆర్ ఉచిత విద్యుత్

వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం నిమిత్తం.. శ్రీకాకుళం జిల్లాకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 40 వేల పైచిలుకు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించనుంది. రూ. 6 కోట్ల నిధుల విడుదలకు పాలనాపరమైన అనుమతులిచ్చింది.

ap logo
ap logo
author img

By

Published : Oct 15, 2020, 4:38 AM IST

వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమలుకు సంబంధించి నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. జిల్లాలోని 40 వేల పైచిలుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లను బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం సెప్టెంబరు మాసానికి సంబంధించి వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమలు కోసం 6 కోట్ల రూపాయలను వినియోగించేందుకు పాలనా పరమైన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ద్వారా ఈ వ్యవసాయ విద్యుత్ మీటర్లను ప్రభుత్వం బిగించనుంది.

ఇదీ చదవండి:

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.