అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 5 లారీలను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని టోల్ ప్లాజా సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న లారీలను స్వాధీనం చేసుకున్నారు. బహుదా నది నుంచి ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాహన యజమానులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. లారీలను సీజ్ చేశారు.
ఇదీచదవండి