బంగాళాఖాతంలో 12 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. వారంతా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. గల్లంతైన మత్స్యకారులంతా చెన్నై నుంచి వేటకు వెళ్లినట్లు సమాచారం. మూడు రోజులుగా వారి ఆచూకీ తెలియకపోవటంతో కుటుంబ సభ్యులు అందోళన వ్యక్తం చేశారు.
గల్లంతైన వారిలో ఐదుగురు సోంపేట మండలం ఇసకపాలెం, రామయ్యపట్నంకు చెందిన వారిగా గుర్తించారు. మరో ఏడుగురు ఒడిశా సరిహద్దు గ్రామాల మత్స్యకారులుగా గుర్తించారు. తమ వారి ఆచూకీని త్వరగా కనుక్కోవాలని బాధితులు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: బస్సు, ట్రక్కు ఢీ- 31 మంది దుర్మరణం