ETV Bharat / state

మేము మంచి చేయం.. మీరూ చేయొద్దు.. వైసీపీ నాయకుల దౌర్జన్యం - జనసేన కార్యకర్తలపై వైసీపీ నాయకుల దాడి

Clash between YSRCP and JanaSena Party Leaders: శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం ఇరగంపల్లిలో వైఎస్సార్సీపీ నాయకులు బావిని పూడ్చివేయటం వివాదానికి దారి తీసింది. గ్రామంలోని జనసేన పార్టీ యువకులు బావిలోని పూడికను తొలగించటంతో అధికార పార్టీ నాయకులు వారిని అడ్డుకున్నారు. జనసేన పార్టీ యువకులను స్టేషన్‌కు తరలించి.. బావిని పూడ్చివేశారు.

Clash between YSRCP and JanaSena
శ్రీ సత్యసాయి జిల్లాలో గొడవ
author img

By

Published : Mar 6, 2023, 6:04 PM IST

Updated : Mar 7, 2023, 6:20 AM IST

Clash between YSRCP and JanaSena Leaders: రాష్ట్రంలో మేము మంచి పనులు చేయం.. వేరే వాళ్లు కూడా చేయొద్దు.. ఇది వైఎస్సార్సీపీ నాయకుల వ్యవహార శైలి. రోజురోజుకు పెరిగిపోతున్న వైసీపీ శ్రేణుల అరాచకాలపై జనసేన నాయకులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రకరకాల కారణాలతో రెచ్చగొడతూ విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. చివరికి గ్రామానికి మంచి చేయడానికి వచ్చిన యువకులను కూడా చేయనివ్వకపోవడం దురదృష్టకరమని వాపోతున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో వేసవి ప్రారంభంలోనే గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు తల్లడిల్లుతున్నారు. గ్రామాల్లో ప్రజలు గుక్కెడు నీటి కోసం.. ఇబ్బందులు పడుతుంటే.. వారికి సాయం చేసేందుకు జనసేన పార్టీకి చెందిన పలువురు యువకులు సిద్ధమయ్యారు. కానీ ఈ విషయం అధికార వైఎస్సార్సీపీ నాయకులకు నచ్చలేదు. వాళ్లు మంచి చేయకపోగా.. సహాయం చేసేందుకు వచ్చిన వారిని పోలీసు స్టేషన్​కు తరలించారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో విధ్వంసం సృష్టించారు. అంతకుముందు అడ్డొచ్చిన జనసేన పార్టీ యువకులను అడ్డుకున్నారు.

నీళ్లులేక అల్లాడుతుంటే.. బావిని పూడ్చివేసిన వైఎస్సార్సీపీ నాయకులు

అసలేం జరిగిందంటే.. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం ఇరగంపల్లిలో అధికార వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నాయకులు.. బావిని పూడ్చి వేయటం వివాదానికి దారి తీసింది. ఈ ఘటన ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇరగంపల్లి గ్రామంలో జనసేన పార్టీకి చెందిన ఇద్దరు యువకులు.. గ్రామంలోని పురాతన బావిలో పూడిక తీశారు. ఇదివరకే రెండు బావులు పూడుకుపోవడంతో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని బావిని అందుబాటులోకి తెచ్చారు.

ఇది అధికార పార్టీకి చెందిన నాయకులకు రుచించలేదు. గ్రామంలో ఏదైనా చేస్తే మేమే చేయాలని.. పూడిక తీసిన బావిని వెంటనే పూడ్చివేస్తామంటూ అడ్డుపడ్డారు. ఆదివారం రాత్రి సర్పంచి భర్త జేసీబీతో బావిని పూడ్చడానికి సిద్దమయ్యాడు. జనసేన పార్టీకి చెందిన గంగాధర్, చింతలప్పలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరిపై వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేశారు.

పోలీసులు గ్రామానికి చేరుకుని.. జనసేన పార్టీకి చెందిన ఇద్దరు యువకులను పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు అక్కడికి చేరుకుని రాత్రి 11 గంటల సమయంలో మరో జేసీబీతో బావిని పూడ్చివేయించారు. నాయకులతో పాటు పంచాయతీ కార్యదర్శి అక్కడికి వెళ్లి బావి పూడ్చే పనులను చూడడం తప్ప.. ఇంకేమీ చేయలేకపోయారు. ఆ తర్వాత జనసేన పార్టీకి చెందిన ఆ ఇద్దరు కార్యకర్తలను పూచికత్తుపై ఇంటికి పంపారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమ గ్రామంలో.. బావిని వినియోగంలోకి తీసుకురావాలని, నీటి సమస్యను తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.

"వైసీపీ సర్పంచ్ భర్త.. నిన్న జేసీబీ సాయంతో బావిని పూడ్చడానికి వస్తే మేము అడ్డుకున్నాము. జనసేన కార్యకర్తలుగా మేము అడిగిన దానికి వాళ్లు సమాధానం చెప్పకుండా.. దౌర్జన్యంగా మాపై చేయి చేసుకొని.. మమ్మల్ని పోలీస్ స్టేషన్​కు తరలించారు. మేము పోలీస్ స్టేషన్​లో ఉన్న సమయంలో బావిని పూడ్చివేయడం జరిగింది". -జనసేన కార్యకర్త

ఇవీ చదవండి:

Last Updated : Mar 7, 2023, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.