Kadiri MLA Siddareddy: గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో శ్రీసత్యసాయి జిల్లా కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గాండ్లపెంట మండలం మలమీదపల్లి సచివాలయం పరిధిలోని కోటూరు, కరణంవరిపల్లి, రెడ్డివారిపల్లి, అరమడకవారిపల్లి గ్రామాలలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో శాసన సభ్యుడు సిద్ధారెడ్డి పాల్గొన్నారు. తాగునీటి సమస్య పరిష్కరించిన తర్వాతనే.. గ్రామంలోకి రావాలంటూ కోటూరులో మహిళలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. సర్ది చెప్పేందుకు స్థానిక నాయకులు ప్రయత్నించినా గ్రామస్థులు వినిపించుకోలేదు.
సర్పంచ్, స్థానిక నాయకులు పట్టించుకోరు.. అధికారుల వినిపించుకోరు.. మా సమస్యలు పరిష్కరించిన తర్వాతే గ్రామంలోకి రావాలంటూ నిలదీయడంతో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అక్కడి నుంచి జారుకున్నారు.
ఇవీ చదవండి: