MLA Nandamuri Balakrishna: శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాన్వాయ్‌ను చిలమత్తూరు పోలీసులు అడ్డుకున్నారు. కొడికొండ గ్రామంలో ఇటీవల వైకాపా నాయకుల దాడిలో గాయపడ్డ తెదేపా కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తుండగా బాలకృష్ణ వాహనాన్ని మాత్రమే అనుమతించి.. మిగిలిన వాహనాలను గ్రామంలోకి అనుమతి లేదంటూ నిలిపివేశారు. తెదేపా శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నియోజవర్గం ఎమ్మెల్యే వస్తే వారి వెంట వెళ్లేందుకు తమను ఎందుకు అనుమతించడంలేదని ప్రశ్నించారు. చివరికి చేసేదేమీ లేక పోలీసులు కొన్ని వాహనాలను అనుమతించడంతో వివాదం సద్దుమణిగింది.
ఇవీ చదవండి: