NARA LOKESH YUVAGALAM PADAYATRA : వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పుట్టపర్తి నియోజకవర్గంలో అనేక సమస్యలు అలాగే ఉన్నాయని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పుట్టపర్తి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ నియోజక వర్గ ఇంఛార్జ్ పల్లె రఘునాథరెడ్డి కార్యకర్తలు, నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. నల్లమడ మండలం పులంగం పల్లి గ్రామం వద్ద ప్రజలు నారా లోకేశ్‌కు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు.
కదిరి నియోజకవర్గంలో పూర్తైన లోకేశ్ యువగళం పాదయాత్ర.. మంగళవారం పుట్టపర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అంగన్వాడీల పోరాటానికి మద్దతుగా.. లోకేశ్‌తో కలిపి టీడీపీ నాయకులు పాదయాత్రలో పాదం కలిపారు. తాజాగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు నారా లోకేశ్ వెంట నడిచారు. వీరితో పాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పుట్టపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభం కాగానే.. లోకేశ్‌కు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల దాహార్తి తీర్చటానికి ఏర్పాటు చేసిన సత్యసాయి తాగునీటి పథకాన్ని కూడా.. ఈ ప్రభుత్వం నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు వైసీపీ ప్రభుత్వం చరమగీతం పడిందని మండిపడ్డారు.
తాగునీటి పథకంలో పనిచేసే కార్మికులకు వేతనాలు అందించలేని దుస్థితిని.. లోకేశ్‌కు వివరించటానికి సమయత్తమవుతున్నారని వివరించారు. సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయటమే తప్ప.. జిల్లా కేంద్రానికి ఉండాల్సిన కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని వాపోయారు. జిల్లా కేంద్రంలో పలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకు లోకేశ్ పాదయాత్ర నిర్వహించిన నియోజకవర్గాల్లో అన్ని వర్గాల వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. జిల్లాలో నెలకొని ఉన్న సమస్యలను లోకేశ్‌కు వివరించినట్లు ఆయన తెలిపారు.
అంతకుముందు కదిరిలో లోకేశ్ పాదయాత్ర : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర 49 వ రోజున కదిరి నియోజక వర్గంలో కొనసాగింది. మంగళవారం ఉదయం కదిరిలోని ఆర్డివో కార్యాలయం వద్ద ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర మధ్యాహ్నం సమయం వరకు నియోజకవర్గంలో పూర్తైంది. కదిరిలో మధ్యాహ్నం బోజన విరామం అనంతరం పుట్టపర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
ఇవీ చదవండి :