ETV Bharat / state

అభివృద్ధిపై ప్రశ్నించిన టీడీపీ.. వైకాపా మాటల దాడి - latest ap news telugu

Hindupur Municipal Council Meeting : హిందుపురం మున్సిపల్​ కౌన్సిల్​ సమావేశాలు అధికార పార్టీ, టీడీపీ కౌన్సిలర్ల వాదోపవాదనల మధ్య వాడివేడిగా జరిగింది. అభివృద్ధిపై ప్రశ్నించినందుకు అధికార పార్టీ కౌన్సిలర్లు మాటలతో దాడికి దిగారు. ఇంతకీ కౌన్సిల్​ సమావేశంలో ఏం జరిగిందంటే..

Hindupur Municipal Council
హిందుపురం మున్సిపల్​ కౌన్సిల్​
author img

By

Published : Jan 31, 2023, 3:53 PM IST

Hindupur Municipal Council Meeting: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశాలు ఉద్రిక్తత నడుమ కొనసాగాయి. పురపాలక పరిధిలోని అభివృద్ధిపై ప్రశ్నించిన టీడీపీ కౌన్సిలర్లపై అధికార పార్టీ కౌన్సిలర్లు మాటలతో దాడికి దిగారు. కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు.. మున్సిపల్ పరిధిలో ఎంత మేరకు అభివృద్ధి జరిగిందో చర్చ జరపాలని డిమాండ్​ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లపై మాటలతో దాడికి దిగారు.

ఇరు పార్టీల కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు తీవ్రస్థాయిలో జరగగా.. కౌన్సిల్​ సమావేశ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కౌన్సిల్​ సమావేశం హాల్లో​కి పోలీసులు చేరుకున్నారు. వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో పోలీసులు ఎందుకు వచ్చారంటూ టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. పోలీసుల అండతో కౌన్సిల్​ సమావేశాలు నిర్వహించటం సరైన పద్ధతి కాదంటూ.. టీడీపీ కౌన్సిలర్లు ఖండించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.