Car Overturned While Illegally Transporting Liquor: శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చి విక్రయిస్తూ.. సొమ్ము చేసుకోవడమే మనోజ్ కుమార్ పని. కర్ణాటకలోని చాకివేలు ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్‌పై ఇప్పటికే పలు కేసులు కూడా ఉన్నాయి. దానికి తోడు బెయిల్‌పై ఉన్నాడు. అయినా సరే తగ్గేదే లే ఉంటూ.. తన పని మొదలు పెట్టాడు ఆ వ్యక్తి. ఎప్పటి లాగే కర్ణాటక నుంచి మద్యం తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. కానీ ఈ సారి ఎలా అయినా సరే పోలీసులకు, సెబ్ అధికారులకు చిక్కకూడదని నిర్ణయించుకున్నాడు.
తాను అనుకున్నట్టుగానే.. కర్ణాటక వెళ్లి మద్యం కొనుగోలు చేశాడు. ప్లాన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నాడు. అంతా సవ్యంగానే జరుగుతుంది అనుకున్నాడు. కానీ అతని కోసం ఎక్సైజ్ పోలీసులు కాపు కాస్తున్నారని తెలుసుకోలేకపోయాడు. ఇంతలో అతను దగ్గరకు రాగానే పోలీసులు వెంబడించడం మొదలుపెట్టారు. ఈ ఊహించని ట్విస్ట్‌తో కంగుతిన్న మనోజ్.. పరారయ్యేందుకు యత్నించాడు.
అక్రమ మద్యం విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డ వైసీపీ నేత - సిగ్గుచేటన్న జనసేన
పోలీసులకు చిక్కితే మరోసారి జైలే గతి అనుకుని.. కారును వేగంగా నడపడం మొదలు పెట్టాడు. మనోజ్ మెరుపు వేగంతో నడుపుతుండటంతో.. పోలీసులు సైతం అంతే వేగంగా వెంబడించారు. ఇంతలో ఆ వ్యక్తి ఊహించని మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తనకల్లు మండలం కోటపల్లి సమీపంలో ఒక్కసారిగా కారు బోల్తా పడింది. కారులో ఉన్న మద్యం మొత్తం చెల్లాచెదురుగా పడిపోయింది.
ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. ఒక వైపు మద్యం, మరోవైపు పోలీసులు. మద్యం కావాలి అనుకుంటే.. ఈ లోపు పోలీసులు వస్తే అతని పని అంతే. అతనిని అరెస్టు చేస్తారు. దానికి తోడు మందు సైతం అతనికి దక్కకుండా పోతుంది. ఇక చివరికి.. ముందు అరెస్టు కాకుండా ఉంటే.. మరోసారి అక్రమంగా రవాణా చేసుకుందాంలే అనుకుని డిసైడ్ అయ్యాడో ఏమో. వాహనాన్ని వదిలి పరారయ్యాడు.
మద్యం అక్రమంగా సరఫరా చేస్తున్న వాలంటీర్ అరెస్టు, 14 రోజుల రిమాండ్
అయితే ఇప్పటి వరకూ మనోజ్‌కు షాక్‌లు తగలగా.. ఇక ఇప్పుడు పోలీసుల వంతు వచ్చింది. మనోజ్ అత్యంత వేగంగా వాహనం నడపడంతో.. పోలీసులు చాలా దూరంలో ఉన్నారు. అతని కారు బోల్తా పడిన ప్లేస్‌కి వచ్చేటప్పటికి ఆలస్యం అయ్యేలా ఉంది. ఇంకేం ఉంది.. కారు వద్దకు భారీగా స్థానికులు చేరుకున్నారు. అందులో మందుబాబులు కూడా ఉన్నారు. కళ్ల ముందే వారికి ఇష్టమైనది కనిపిస్తుంటే.. ఎవరైనా సరే ఎందుకు ఆగుతారు చెప్పండి.
స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకుని.. ఎవరికి దొరికినది వారు ఎత్తుకెళ్లేందుకు పోటీపడ్డారు. పెద్ద మొత్తంలో మద్యం ఉండటంతో.. దాదాపు అందులో ఉన్నదాంట్లో 90 శాతాన్ని ఖాళీ చేశారు. ఇంతలో సెబ్ అధికారులు అక్కడికి చేరుకుని.. వాహనంలో ఉన్న మిగిలిన మద్యం, ఇతర ఆధారాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సీఎం ఇలాకాలో వైసీపీ నేతల చీకటి దందా.. జోరుగా దొంగనోట్లు, అక్రమ మద్యం వ్యాపారాలు