ETV Bharat / state

కందుకూరు ఘటన మనసును తీవ్రంగా కలచివేసింది: ఎమ్మెల్యే బాలకృష్ణ

MLA Balakrishna, Yanamala emotional on Kandukur incident: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరులో గతరాత్రి నిర్వహించిన బహిరంగ సభలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన తమ మనసును తీవ్రంగా కలచివేసిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విచారం వ్యక్తం చేశారు. పార్టీ జెండా మోసే కార్యకర్తల పాడేను మోయాల్సి రావడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

MLA Balakrishna
కందుకూరు ఘటన మనసును కలచివేసింది
author img

By

Published : Dec 29, 2022, 1:53 PM IST

MLA Balakrishna, Yanamala emotional on Kandukur incident: నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన బహిరంగ సభలో 8 మంది కార్యకర్తలు మృతి చెందడం తమ మనసును తీవ్రంగా కలచివేసిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విచారం వ్యక్తం చేశారు. పార్టీ జెండా మోసే కార్యకర్తల పాడేను మోయాల్సి రావడం అత్యంత బాధాకరమని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 8 మంది కార్యకార్తల మరణవార్త 80 లక్షల కార్యకర్తల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు బాలకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పార్టీకి మూలస్తంభాలైన కార్యకర్తల్ని కోల్పోవటం విషాదకరమని యనమల రామకృష్ణుడు విచారం వ్యక్తం చేశారు. టీడీపీ సభలకు వైసీపీ ప్రభుత్వం సహకరించంటం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభలకు వేలాది మందితో పహారా కాస్తున్న పోలీసులు.. చంద్రబాబు నాయుడు సభలకు మాత్రం నామమాత్రంగా భద్రత కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని యనమల హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.