ETV Bharat / state

వైకాపా నాయకుడు రామకృష్ణారెడ్డి హత్య కేసు.. 16 మంది అరెస్ట్ - వైసీపీ మాజీ కోఆర్డినేటర్ హత్య

YCP leader ramakrishna reddy murder: ఈనెల 8న జరిగిన వైకాపా నాయకుడు రామకృష్ణారెడ్డి హత్య కేసులోని నిందితులను ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 16 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కక్షపూరితంగానే ఈ హత్య జరిగిందని.. వ్యక్తుల మధ్య విభేదాలే హత్యకు దారి తీసినట్లు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

హత్య
murder
author img

By

Published : Oct 27, 2022, 10:19 PM IST

Updated : Oct 28, 2022, 7:23 AM IST

వైకాపా నాయకుడు రామకృష్ణారెడ్డి హత్య కేసు.. 16 మంది అరెస్ట్

YCP leader ramakrishna reddy murder: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో వైకాపా నేత రామకృష్ణారెడ్డిని.. సొంత పార్టీ వారే హత్య చేశారని.. పోలీసులు తేల్చారు. వైకాపా ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ వద్ద పనిచేసే గోపీకృష్ణ హత్య చేయించారని.. మృతుడి బంధువులు ఆరోపణలు చేస్తుండగా.. ఆ కోణంలో దర్యాప్తు జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
హిందూపురంలో వైకాపా నాయకుడు చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య కేసు దర్యాప్తు పూర్తి చేసినట్లు.. పోలీసులు గురువారం వెల్లడించారు. సొంత పార్టీ నేతలే రామకృష్ణారెడ్డిని హత్య చేశారని తేల్చారు. ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని.. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారని పోలీసులు చెప్పారు. గతంలో రామకృష్ణారెడ్డి వద్ద పనిచేసి.., కర్ణాటకలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారితోపాటు.., రామకృష్ణారెడ్డి అంటే గిట్టని వైకాపాలోని మరో వర్గంలోని కొందరు కలిసి కుట్ర చేసి.. హత్య చేశారని... పోలీసులు చెప్పారు. పార్టీలోని వర్గ విభేదాలే హత్యకు కారణమని భావిస్తున్నట్లు తెలిపారు.
హిందూపురం వైకాపాలో రెండేళ్లుగా వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. స్థానికేతరుడైన ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమించడంతో ఆయన వ్యవహార ధోరణి నచ్చక అక్కడి నాయకులు మూడు వర్గాలుగా విడిపోయారు. గతంలో నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా పనిచేసిన చౌళూరు రామకృష్ణారెడ్డి... ఈ వర్గ విభేదాల కారణంగా పార్టీకి దూరంగా ఉండి హోటల్‌ నిర్వహించుకుంటున్నారు. రామకృష్ణారెడ్డితో ఎప్పటికైనా.... తమ రాజకీయ ఎదుగుదలకు ఇబ్బందేనని భావించిన వైకాపాలోని కొందరు వ్యక్తులు ఆయన్ను అడ్డుతొలగించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హిందూపురానికి సంబంధించిన కేసు వివరాలను పోలీసులు ధర్మవరంలో వెల్లడించడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ధర్మవరం డీఎస్పీ రమాకాంతే.. హిందూపురం ఇన్‌ఛార్జిగానూ ఉండటంతో అక్కడే వివరాలు వెల్లడించారని పోలీసులు వివరణ ఇచ్చారు. అయితే కీలక నిందితులను కేసు నుంచి తప్పిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 28, 2022, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.