YSRCP Government Failed : ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానందంటా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచటం చేతకాని రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష 2.O (Jagananna Arogya Suraksha 2.O) పేరిట ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు ప్రచారానికే పనికొస్తున్నాయి. గ్రామాల్లో మంగళవారం, పట్టణాల్లో బుధ వారం నుంచి శిబిరాలు ప్రారంభించారు. అక్కడక్కడ స్పెషలిస్టు వైద్యులు వచ్చినా, రోగులకు సాధారణ వైద్య సేవలే అందించారు. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందే అరకొర వైద్యమే ఇక్కడా లభించింది. జగనన్న బొమ్మతో ఉన్న బ్యాగుల్లో మందులు పెట్టి రోగులకు ఇచ్చారు. పట్టణాల్లో 300, గ్రామాల్లో 400 నుంచి 500 వందల మంది రోగులు ఈ శిబిరాలకు వచ్చేలా వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. అయినా వైద్య శిబిరాలు వెలవెలబోయాయి.
ప్రచారానికే పరితమైన జగనన్న ఆరోగ్య సురక్ష 2.O
People Reject Jagananna Arogya Suraksha Scheme : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష కేంద్రాలు మొక్కుబడి ఏర్పాటు చేశారు. పురుషోత్తపురం పురపాలక ఉన్నత పాఠశాలలో ఆర్భాటంగా ప్రారంభించినా ప్రత్యేక వైద్యులను నియమించలేదు. ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు మాత్రమే వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూ రులో మోకాళ్ల నొప్పులు, చర్మ వ్యాధుల చికిత్సకు రోగులు రాగా అందుకు సంబంధించిన వైద్యులు లేరు. విజయవాడలోని రామలింగేశ్వరనగర్ లో ఏర్పాటు చేసిన శిబిరానికి పెద్దగా రోగులు రాలేదు. న్యూ వాంబే కాలనీలో వైద్యుల కోసం రోగులు పడిగాపులు కాయాల్సి వచ్చింది.
పార్టీ ప్రచారం కోసం పీహెచ్‌సీలపై చిన్నచూపు - జగనన్న ఆరోగ్య సురక్షకు కోట్ల రూపాయల ఖర్చు
తుతూ మంత్రంగా జగనన్న ఆరోగ్య సురక్ష 2.O : ప్రకాశం జిల్లా మార్కాపురంలో జగనన్న సురక్ష 2.O కార్యక్రమం తుతూ మంత్రంగా నిర్వహించారు. రోగులను పరిక్షించే పరికరాలు ఎక్కడా కనిపించలేదు. కేవలం ఐదుగురు సాధారణ వైద్యులు మాత్రమే హాజరయ్యారు. వచ్చిన కొద్దిపాటి రోగులకు మందులు మాత్రమే ఇచ్చారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం ముచ్చర్ల, మెంటాడ మండలం పిట్టాడ గ్రామాల్లో అశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసినా రోగులు రాలేదు.
సాధారణ సేవలకే పరిమితం : విశాఖ జిల్లా పద్మనాభం మండలం అయినాడ గ్రామంలో మంగళవారం జరిగిన ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రచార ఆర్భాటంగానే సాగింది. స్పెషా లిటీ వైద్యులు వస్తారని చెప్పినా సాధారణ సేవలే అందించారు. కాళ్ల నొప్పులు అని చెప్పిన వారికి డైక్లో ఫినాక్, నీరసంగా ఉన్న వారికి బి. కాంప్లెక్స్ మాత్రలు ఇచ్చి పంపించారు.