కల్వర్టుపై నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో జరిగింది. పర్చూరుకి చెందిన అబ్దుల్ నజీర్ (27)... తన స్నేహితులతో కలిసి సరదాగా రామాపూరం సముద్రతీరానికి వెళ్లాడు. స్నానం చేసిన తరువాత సేద తీరేందుకు బీచ్ సమీపంలో ఉన్న చిన్నపాటి కాలువ కల్వర్ట్ పై పడుకున్నాడు. నిద్రమత్తులో జారి కింద పడ్డాడు. కింద ఉన్న గాజు సీసా పెంకులు మెడపై గుచ్చుకోగా... తీవ్ర రక్తస్రావం జరిగింది. హుటాహుటిన ఆతన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా.. అప్పటికే నజీర్ మృతి చెందాడని వైద్యులు నిర్ధరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చూడండి: