ETV Bharat / state

పోలీసులు కొట్టారని పీఎస్‌ ఎదుటే దళిత యువకుడు ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ మృతి

Young Man Committed Suicide Duo To Police Harrasement: పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్యకు యత్నించిన దళిత యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. మరోవైపు తనపై స్కూలు యాజమాన్యం కక్ష గట్టిందని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది.

Young_Man_Committed_Suicide_Duo_To_Police_Harrasement

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 2:05 PM IST

పోలీసులు కొట్టారని కొట్టారని-పీఎస్‌ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని దళిత యువకుడు ఆత్మహత్య

Young Man Committed Suicide Duo To Police Harrasement : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పోలీసుల వేధింపుల వలన ఆత్మహయత్నానికి పాల్పడిన దళిత యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 6 తేదీన యర్రగొండపాలెంలో పోలీసులు కొట్టారని మనస్థాపానికి గురైన మోజేష్ పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రగాయాలైన యువకున్ని పోలీసులే మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.

తాను ఏ తప్పు చేయకపోయినా పోలీసులు తనను తీవ్రంగా కొట్టడంతో పాటు తన తండ్రిని దర్బాషలాడారని బాధిత యువకుడే ఆరోపించాడు. ఎస్సై, సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు కారణమని వెల్లడించాడు. మోజేష మృతి చెందిన నేపథ్యంలో దళిత సంఘాలు, కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించే అవకాశం ఉండడంతో, పోలీసులు ముందస్తుగానే యర్రగొండపాలెంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

గోదావరిలో దూకి యువకుడు ఆత్మహత్య.. పోలీసుల వేధింపులే కారణమని లేఖ

Teacher Suicide Attempt Due To School Management Harassment : ఓ ప్రైవేటు స్కూలు ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోట చేసుకుంది. యాజమాన్యం వేధింపులే కారణమంటూ బాధితుడు, కొంత మంది ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెదవేగి మండలం వేగివాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తడికలపూడికి చెందిన కొత్తపల్లి రత్తయ్య ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. ఈయనను కొంతకాలం కిందట స్కూలు యాజమాన్యం తొలగించింది. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన రత్తయ్య ఈ నెల 10న రాత్రి తడికలపూడిలో పురుగుల మందు తాగారు. తీవ్ర అస్వస్థతకు గురైన రత్తయ్యను కుటుంబ సభ్యులు ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతున్నారు.

బుక్కరాయసముద్రం సీఐ వేధింపులు భరించలేక దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం

తనపై స్కూలు యాజమాన్యం కక్ష గట్టిందని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నానని బాధితుడు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ నాయకులు స్పందించారు. స్కూల్​లో జరుగుతున్న అక్రమాలను ఎత్తి చూపినందుకే రత్తయ్యను ఉద్యోగం నుంచి తొలగించారని, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక ఈ దారుణానికి ఒడిగట్టారని ఒక ప్రకటనలో ఆరోపించారు.

డీఎస్ఈవోకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, కింది స్థాయి అధికారులు లంచాలకు కక్కుర్తి పడి యాజమాన్యం చేసిన తప్పుడు ఆరోపణలను సమర్థిస్తూ బలవంతంగా సహ ఉద్యోగులతో తప్పుడు సాక్ష్యాలు రికార్డు చేయించారని ఆరోపించారు. రత్తయ్య 8, 9 తరగతుల విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని, పాఠాలు సరిగా చెప్పడం లేదని కొందరు తల్లిదండ్రులు ఆరోపణలు చేశారని కొంతమంది చెబుతున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తడికలపూడి ఎస్​ఐ జయబాబు తెలిపారు

వేధింపుల ఆరోపణలపై ఇద్దరు సీఐలపై వేటు - వీఆర్​కు పంపించిన ఎస్పీ అన్బురాజన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.