నివర్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైకాపా రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లాలోని పర్చూరు, ఇంకొల్లు మండలాల్లోని పలు గ్రామాల్లో పొలాలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. దెబ్బతిన్న మిర్చి, పొగాకు పంటల వివరాలు తెలుసుకున్నారు.
ప్రకాశం జిల్లాలో లక్ష హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయన్న ఆయన, పర్చూరు నియోజకవర్గంలో మిరప, పత్తి, పొగకునకు ఎక్కువ నష్టం కలిగిందని వివరించారు. ప్రతి రైతుకు సీఎం జగన్ న్యాయం చేస్తారని స్పష్టం చేశారు. రెండో పంట వేసుకోవటానికి విత్తనాలు ఇస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: