Chirala municipal meeting: ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిల్ వేదికగా వైకాపాలోని రెండు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సమావేశం మధ్యలో కొత్త అజెండా ఇవ్వడంపై మున్సిపల్ ఛైర్మన్ వ్యతిరేక వర్గం ఆగ్రహం వ్యక్తంచేసింది. మొత్తం మూడు సమావేశాలు ఏర్పాటు చేయగా 2022- 23 సంవత్సరానికి గాను రూ. 18.84 కోట్లతో పాలక వర్గం బడ్జెట్ను ప్రవేశపెట్టారు. చిరు వ్యాపారుల కోసం రోడ్డు డివైడర్ల స్థానంలో షెడ్లు ఏర్పాటుచేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించడాన్ని అధికారపార్టీలోని కొందరు కౌన్సిలర్లు తీవ్రంగా తప్పుబట్టారు.
ఛైర్మన్ తీరును నిరసిస్తూ కౌన్సిల్ హాల్‌లో బైఠాయించారు. నిరసనల మధ్య సమావేశం ముగిసిందని ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో కమిషనర్ మల్లేశ్వరరావుకి 11మంది కౌన్సిలర్లు డీసెంట్ ఇచ్చారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: 28 మంది ఎంపీలు ఉండి 32 నెలల్లో ఏం చేశారు: చంద్రబాబు