ETV Bharat / state

ఆ మార్గంలో ప్రయాణం అంటే... ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పోవాల్సిందే..! - తెలుగు వార్తలు

WORST ROADS IN PRAKASAM : ప్రయాణం అంటే సాఫీగా సాగిపోవాలి. కానీ ఆ మార్గంలో ప్రయాణం అంటే.. పడుతూ..లేస్తూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పోవాల్సి వస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ఆ మార్గంలో ..అడుగుకో గుంతా.. గజానికో గండం ఎదురవుతోంది. ప్రకాశం జిల్లా ఊళ్ళపాలెం - వేములపాడు రహదారిలో ప్రయాణం అంటే ప్రజలు భయపడాల్సి వస్తోంది.

WORST ROADS
WORST ROADS
author img

By

Published : Jan 23, 2022, 6:15 PM IST

WORST ROADS IN PRAKASAM : ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్‌లో ఊళ్లపాలెం - వేములపాడు రహదారి మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. కనిగిరి, కందుకూరు మధ్యే కాకుండా.., అటు కర్నూలు జిల్లా వెళ్లే వారికి కూడా ఇది ప్రధాన రహదారే. కానీ అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. దాదాపు వందేళ్ల క్రితం నిర్మించిన కల్వర్టులు ఇప్పటికీ సేవలందిస్తున్నాయి. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ మార్గంలో.. దారి పొడువునా గుంతలే దర్శనమిస్తాయి.

టెండర్‌ పూర్తయి ఆరు నెలలైనా..

ఈ రహదారి నిర్మాణానికి రెండు విభాగాలుగా టెండర్లు పిలిచారు. 12 కి.మీ. రోడ్డు నిర్మాణానికి 18 కోట్లు రూపాయలు మంజూరయ్యాయి. మిగిలిన 8 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి నేషనల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నిధులతో టెండర్లు పిలిచారు. టెండర్‌ పూర్తయి ఆరు నెలలైనా గుత్తేదారులు ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. గుంతలమయమైన ఈ మార్గంలో ప్రయాణం వల్ల..నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహనాల మరామ్మతులకు గురవుతున్నాయని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అడుగడుగునా గుంతలతో ఉన్న రహదారిని అభివృద్ధి చేసి ఆస్థి, ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలని చేయాలని స్థానికులు వేడుకుంటున్నారు.

ఆ మార్గంలో ప్రయాణం అంటే... ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పోవాల్సిందే..!

ఇదీ చదవండి : ఈ దారిలో ప్రయాణిిస్తే అంతే.. షెడ్డుకు వెళ్లాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.