ప్రకాశం జిల్లా చీరాల సాల్మన్ సెంటర్లో ఓ మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. భర్తతో విడాకులు అవ్వడంతో గత కొన్నేళ్లుగా ఊటుకూరి భాగ్యలక్ష్మి(60) ఒంటరిగా నివసిస్తోంది. మంగళవారం ఉదయం భాగ్యలక్ష్మి ఇంటికి వెళ్లి చూడగా.. ఆమె మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ఒంటిపై గాయాలు లేవని.. అనారోగ్యంతో మృతి చెందిందా, ఇతర కారణలున్నాయా అన్నది విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్టులో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని డీఎస్పీ పి.శ్రీకాంత్ తెలిపారు.
ఇదీ చదవండి: