ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని వేములపాడు గ్రామంలో... ఒకే వర్గానికి చెందిన 306 ఓట్లను ఎన్నికల జాబితా నుంచి తొలగించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు... తమ ఓటు హక్కును ఇప్పుడెలా తీసేస్తారని ప్రశ్నిస్తున్నారు. తొలగించిన ఓట్లలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు. పింఛన్ తీసుకుంటున్న వృద్ధుల ఓట్లు, పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారి ఓట్లు తొలగించారు. దీనిపై వివరణ కోరగా అధికారులు స్పందించటం లేదని బాధితులు చెబుతున్నారు. అధికార పార్టీ నేతలే ఈ పని చేశారని ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: గుంటూరులో రైతు భరోసా కేంద్రాల పరిశీలన