ప్రకాశం జిల్లా కొమ్మాలపాడు వద్ద అద్దంకి బ్రాంచి కాలువలో ఈతకు వెళ్లిన గ్రామ సచివాలయ ఉద్యోగి గల్లంతయ్యాడు. గల్లంతయిన వ్యక్తి సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం గ్రామ సచివాలయంలో... డిజిటల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సురేంద్రగా స్థానికులు గుర్తించారు. కాలువలో ఎక్కువ నీరు ఉండడంతో ఆచూకీ లభించలేదు. గ్రామస్థులు , గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. సురేంద్ర ప్రకాశం జిల్లా చీరాల వాసిగా సంతమాగులూరు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: