భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాల సముద్రతీరంలో అధికారులు అప్రమత్తమయ్యారు.. వాడరేవు సముద్రంలో 3వ నెంబరు ప్రమాద సూచిక ఎగురవేశారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలు కురిస్తే ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చీరాల తహసీల్దార్ విజయలక్ష్మి తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉన్నామని... సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తహసీల్దార్ చెప్పారు.
ఇదీ చదవండి: